TS CPGET 2022 Notification Date: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలకు చెందిన ఉపకులపతులతో (VCs) ఉన్నత విద్యా మండలి (TSCHE) సోమవారం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది నిర్వహించబోయే (2022) కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ విధానంలో పలు మార్పులు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది. ఏ డిగ్రీ చేసిన విద్యార్థులైనా ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేసింది. ఎప్పటిమాదిరిగానే ఈ ఏడాది కూడా కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET 2022) నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కే అప్పగిస్తున్నట్లు తెల్పింది. తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఈ నెలాకరులో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ (2022-23) విద్యాసంవత్సరానికి సంబంధించి జీరో అడ్మిషన్లు నమోదైన కాలేజీలను, కోర్సులను రద్దు చేయాలని సమావేశంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఒక కోర్సులో 15 మంది కంటే తక్కువ విద్యార్ధులు చేరితే వారిని ఇతర కోర్సులకు బదిలీ చేయడం లేదా డిస్టెన్స్ లో చేసే అవకాశం అవ్వాలని వీసీలకు సూచించింది.
Also Read: