THSTI Recruitment 2021: ఫరీదాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్‌టీఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఈ సంస్థలో సైంటిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (మే31) ముగియనున్న నేపథ్యంలో ఓసారి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రిన్సిపల్ సైంటిస్ట్–2 (01), ప్రిన్సిపల్ సైంటిస్ట్–1 (01), సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ (01), రీసెర్చ్ సైంటిస్ట్(క్లినికల్)–01, టెక్నికల్ ఆఫీసర్–2 (06), టెక్నికల్ ఆఫీసర్–1 (01), సీనియర్ టెక్నీషియన్(క్లినికల్) (02), సీనియర్ టెక్నీషియన్ (లేబొరేటరీ) (01) పోస్టులు ఉన్నాయి.
* ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీ రేపే. (31-05-2021)
* స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూను జూనల్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..