TS TET 2022: సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదటి అడుగుపడిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలం తర్వాత టెట్ నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంతరం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇక టెట్ పరీక్ష జరుగుతోన్న రోజునే ఆర్‌ఆర్‌బీ పరీక్ష కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టెట్‌ను వాయిదా వేయాలంటూ పలువురు రాజకీయ నాయకులతో పాటు అభ్యర్థులు సైతం డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ముందుగా అనుకున్న విధంగానే టెట్‌ను ఆదివారమే నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే పరీక్షకు హాజరవుతోన్న అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలపై ఓ లుక్కేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..