Hyderabad: ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు మెకానికిల్, సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని కోర్సులకు సమానంగా డిమాండ్ ఉండేది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మాత్రం కంప్యూటర్ సైన్స్‌దే ఆధిపత్యంగా మారిపోయింది. విద్యార్థులు భారీ ఎత్తున కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపు మొగ్గుచూపడంతో కాలేజీలు సైతం ఇతర కోర్సులను తగ్గిస్తూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకు జై కొడుతున్నాయి. ఇందులో భాగంగా జెఎన్టీయూ పరిధిలో 2022-23 విద్యా సంవత్సరరానికి గాను కంప్యూటర్ సైన్స్‌లో కొత్తగా సీట్లు అందుబాటులోకి తీసుకురానున్నాయి.
గతేడాది మొత్తం 85,500 ఇంజనీర్ సీట్లు ఉండగా వీటిలో 43,000 కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఉన్నాయి. అయితే ఈసారి ఈ సంఖ్య 49,000పైగానే ఉండనుంది. అలాగే ఈ విద్యా సంవత్సరం 104 ఇంజనీరింగ్ కళాశాలలు సీట్లను ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు అప్లై చేసుకున్నాయి. ఇతర కోర్సులు తగ్గించుకుని కంప్యూటర్ సైన్స్‌లో పెంచుకునేందుకు అనుమతి కోరాయి. పరిశీలించిన జేఎన్‌టీయూ అధికారులు కంప్యూటర్ సైన్స్‌లో సీట్లు పెంచుకునేందుకు పలు కళాశాలలకు ఎన్‌వోసీలు జారీ చేశారు. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్‌తో పాటు సీఎస్‌ఈ-కృత్రిమ మేధ-మెషిన్ లెర్నింగ్(ఏఐ-ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ, డాటాసైన్స్, ఐటీ బ్రాంచీల్లో సీట్లు భారీగా పెంచుకున్నాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..