Telangana Schools: ప్రైవేటు స్కూల్స్‌ ఫీజులుంపై చట్టం తేవాలి.. తల్లిదండ్రుల సంఘం డిమాండ్‌..

|

Mar 31, 2022 | 7:50 PM

Telangana Schools: కరోనా (Corona) కారణంగా పాఠశాలలు మూతపడడం, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా.. బోధనేతర ఫీజులు లేకపోవడం పలు ప్రైవేటు పాఠశాలలు నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఫీజులు పెంచొద్దంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

Telangana Schools: ప్రైవేటు స్కూల్స్‌ ఫీజులుంపై చట్టం తేవాలి.. తల్లిదండ్రుల సంఘం డిమాండ్‌..
Private Schools Fees
Follow us on

Telangana Schools: కరోనా (Corona) కారణంగా పాఠశాలలు మూతపడడం, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా.. బోధనేతర ఫీజులు లేకపోవడం పలు ప్రైవేటు పాఠశాలలు నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఫీజులు పెంచొద్దంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు విద్యా సంవత్సరాలుగా జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నష్టపోయిన ఆ మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేయడానికి ప్రైవేటు విద్యా సంస్థలు సిద్ధమవుతున్నాయి. 15 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలో భారీగా ఫీజులు పెరిగే అవకాశం ఉండనున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కరోనా కారణంగా ఆదాయాలు తగ్గడం, అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పుడు స్కూల్‌ ఫీజులతో ఎలా అని పేరెంట్స్‌ తలలు పట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలు ఫీజులుంకు అడ్డుకట్ వేయడానికి తెలంగాణ తల్లిదండ్రలు సంఘం సిద్ధమవుతోంది. స్కూల్స్‌ ఫీజుల రెగ్యులేషన్‌ కోసం చట్టం తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై టీపీఏ, టెక్నీకల్ కేలేజీల అధ్యాపక సంఘం, బాలల హక్కుల పరిరక్షణ వేదిక, ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాజస్థాన్ మాదిరి రాష్ట్రస్థాయి కమిటీ ఆధ్వర్యంలో మూడేళ్లకు ఓ సారి ఫీజులు నిర్ణయించే చట్టం చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.

ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చనే తిరుపతిరావు కమిటీ సిఫార్సుపై సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం కోసం ఏప్రిల్ 18న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రుల నుంచి సంతకాలు సేకరణ చేసి ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని కార్యాచరణ సిద్ధం చేశారు.

Also Read: Bandi Sanjay Letter: ఆసరా పెన్షన్ల సంగతేంది.. సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Twitter IPL: ఐపీఎల్‌ లవర్స్‌ కోసం ట్విట్టర్‌ కొత్త ఫీచర్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌తో పాటు మరెన్నో..

ఒక్క ట్రైలర్ తోనే మెగా హీరో సినిమాకు భారీ బిజినెస్.. ‘గని’ శాటిలైట్ రైట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే