పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల.. ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయంటే..

|

Feb 05, 2023 | 9:55 PM

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 19న జరిగే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఫిబ్రవరి 15 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు....

పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల.. ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయంటే..
AP Police Constable Prelims
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 19న జరిగే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఫిబ్రవరి 15 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. 19 వ తేదీన ఉదయం పది గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు షిఫ్ట్ – 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు షిఫ్ట్ – 2 పరీక్షలు జరగుతాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.

మరోవైపు.. కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కానిస్టేబుల్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. మొత్తం 6,100 పోస్టుల భర్తీ కోసం గతనెల 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..