TGRDC CET 2024: తెలంగాణ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఏప్రిల్‌ 28న ప్రవేశ పరీక్ష

|

Mar 15, 2024 | 7:44 PM

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బాలుర/బాలికల సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదలైంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్‌కు RDC CET-2024 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 12, 2024లో దరఖాస్తు చేసుకోవచ్చు..

TGRDC CET 2024: తెలంగాణ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఏప్రిల్‌ 28న ప్రవేశ పరీక్ష
TGRDC CET 2024
Follow us on

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బాలుర/బాలికల సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదలైంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్‌కు RDC CET-2024 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 12, 2024లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో ఏప్రిల్‌ 28న ప్రవేశ పరీక్ష జరగనుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఏప్రిల్‌ 21 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ, బీకాం, బీఏ, బీబీఏ, బీఎస్సీ- ఫ్యాషన్‌ టెక్నాలజీ, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌, బీఎస్సీ (ఆనర్స్‌) డిజైన్‌, టెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో బీకాం.. వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. RDC CET-2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా 2023-24లో ఇంటర్‌ పరీక్షల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో కనీసం 40 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకుండా ఉండాలి.

ప్రవేశపరీక్షలో సాధించిన ర్యాంక్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. RDC CET 2024 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. రెండున్నర గంటల సమయంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. ఇంటర్‌ సిలబస్‌ ఆధారంగానే ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు ఉండవు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాలి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఎటింటి ఫీజులు ఉండవు. పూర్తిగా ఉచితంగా విద్యా, వసతి అందిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.