TGPSC Group2 Edit Option: టీజీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్ధులకు అలర్ట్.. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ఎడిట్‌ ఆప్షన్‌ క్లోజ్‌

|

Jun 20, 2024 | 9:16 AM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్- 2 సర్వీసుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను సరిచేసుకునేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-2 సర్వీసుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో తప్పులను సవరించుకునేందుకు జూన్‌ 16వ తేదీ నుంచి అవకాశం ఇచ్చింది. ఎడిట్‌ ఆప్షన్‌ ఈ రోజు (జూన్‌ 20వ తేదీ) సాయంత్రం..

TGPSC Group2 Edit Option: టీజీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్ధులకు అలర్ట్.. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ఎడిట్‌ ఆప్షన్‌ క్లోజ్‌
TGPSC Group2 Edit Option
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 20: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్- 2 సర్వీసుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను సరిచేసుకునేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-2 సర్వీసుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో తప్పులను సవరించుకునేందుకు జూన్‌ 16వ తేదీ నుంచి అవకాశం ఇచ్చింది. ఎడిట్‌ ఆప్షన్‌ ఈ రోజు (జూన్‌ 20వ తేదీ) సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఇప్పటి వరకూ ఎడిట్‌ చేసుకోని వారు ఈ రోజు ముగింపు సమయంలోపు వివరాలను సరిచేసుకోవాలని కమిషన్‌ చూచింది. ఆ తర్వాత ఏదైనా తప్పులు దొర్లితే ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎడిట్ పూర్తయిన త‌ర్వాత ద‌ర‌ఖాస్తులను పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

టీజీపీఎస్సీ గ్రూప్-2 ఎడిట్‌ ఆప్షన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ పీఈసెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజల్ట్‌ డైరెక్ట్ లింక్ ఇదే..

తెలంగాణ పీఈసెట్-2024 ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. ఈ ఫ‌లితాల‌ను ఉన్నత విద్యామండ‌లి అధికారులు తాజాగా విడుద‌ల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఏడాది పీఈసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీ పర్యవేక్షణలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల‌కు టీజీ పీఈసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

టీఎస్ పీఈసెట్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.