TGPSC DAO 2024 Hall Tickets: టీజీపీఎస్సీ డీఏవో పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే

|

Jun 26, 2024 | 2:30 PM

తెలంగాణ రాష్ట్రంలో 53 డివిజనల్‌ ఎకౌంట్స్‌ అధికారుల (డీఏవో) గ్రేడ్‌ - 2 పోస్టుల భర్తీకి నిర్వహించవల్సిన రాత పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడులయ్యాయి. ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాత పరీక్షలు జూన్‌ 30వ తేదీ నుంచి జులై 4 వరకు మల్టీసెషన్స్‌లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు...

TGPSC DAO 2024 Hall Tickets: టీజీపీఎస్సీ డీఏవో పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే
TGPSC DAO 2024 Hall Tickets
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 26: తెలంగాణ రాష్ట్రంలో 53 డివిజనల్‌ ఎకౌంట్స్‌ అధికారుల (డీఏవో) గ్రేడ్‌ – 2 పోస్టుల భర్తీకి నిర్వహించవల్సిన రాత పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడులయ్యాయి. ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాత పరీక్షలు జూన్‌ 30వ తేదీ నుంచి జులై 4 వరకు మల్టీసెషన్స్‌లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష ఉంటుంది. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, పేపర్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్ధులు హాల్‌ టికెట్లతోపాటు ఏదైనా గుర్తింపు కార్డును తమతోపాటు పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా తీసుకు రావాలని అధికారులు తెలిపారు. వీటిని తీసుకెళ్లని వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

నేటి నుంచి ఏపీ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 26 నుంచి మొదలవుతుంది. డిప్లొమా (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు జూన్‌ 26 నుంచి జూన్‌ 30 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేటర్‌ డా.వై.ద్వారకానాథ్‌ రెడ్డి తెలిపారు. జూన్‌ 27 నుంచి జులై 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన, జులై 1 నుంచి 4 వరకు వెబ్‌ ఐచ్ఛికాలు, జులై 8న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 9 నుంచి 15వ తేదీలోపు సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయవల్సి ఉంటుంది. జులై 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

జులై 6 నుంచి తెలంగాణ ఎల్‌ఎల్‌బీ పరీక్షలు

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ (ఆరో సెమిస్టర్‌) పరీక్షలు జులై 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి డా.శ్రీరంగప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.