TG 10th Hall Tickets 2025: మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు శుక్రవారం (మార్చి 7) విడుదలకానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఎ కృష్ణారావు ఓ ప్రటకనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఆయా పాఠశాలలకు కూడా హాల్‌ టికెట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు..

TG 10th Hall Tickets 2025: మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే
TG 10th Hall Tickets

Updated on: Mar 07, 2025 | 1:47 PM

హైదరాబాద్‌, మార్చి 7: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల హాల్‌టికెట్లు శుక్రవారం (మార్చి 7) విడుదలకానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో (www.bse.telangana.gov.in నేడు హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచనుంది. అలాగే హాల్‌ టికెట్లను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సైతం పంపిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ కృష్ణారావు ఓ ప్రటకనలో తెలిపారు. ఏదైనా కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు విద్యార్ధులకు హాల్‌టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షలు రాయవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,544 పాఠశాలల నుంచి 4.97 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలుంటాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని కృష్ణారావు చెప్పారు.ఇక పదో తరగతి పరీక్షలు గతంలో మాదిరిగానే ఈసారి కూడా 80 శాతం మార్కులకు మాత్రమే జరగనున్నాయి. మిగతా 20 శాతం ఇంటర్నల్‌ మార్కులు జత చేస్తారు. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి.. 100 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది కూడా. అలాగే ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు గ్రేడ్స్‌కు బదులు మార్కుల రూపంలోనే వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇటీవల విద్యాశాఖ జీవో కూడా జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..

  • 2025 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష
  • 2025 మార్చి 22 న సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష
  • 2025 మార్చి 24 న ఇంగ్లీష్ పరీక్ష
  • 2025 మార్చి 26 న మ్యాథ్స్ పరీక్ష
  • 2025 మార్చి 28 న ఫిజికల్ సైన్స్ పరీక్ష
  • 2025 మార్చి 29 న బయోలాజికల్ సైన్స్ పరీక్ష
  • 2025 ఏప్రిల్ 2 న సోషల్ స్టడీస్ పరీక్ష

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.