Territorial Army Officer Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన న్యూఢిల్లీలోని టెరిటోరియల్ ఆర్మీ.. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్లు పోస్టు (Teritorial Army Posts)ల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: పోస్టును బట్టి నెలకు రూ.56,100ల నుంచి రూ.2,17,600ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నిర్ధేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు, రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్ 1లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ విభాగాల నుంచి 100 ప్రశ్నలు, పేపర్ 2లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. రెండు పేపర్లకు రెండేసి గంటల చొప్పున సమయం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు రుసుము: రూ.200
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 1, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 30, 2022.
రాత పరీక్ష తేదీ: సెప్టెండర్ 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.