Medical Education: మన దేశంలో చైనా ఎంబీబీఎస్‌లే ఎక్కువ! ఏకంగా 16 దేశాల్లో మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థులు..
లక్షలు పోసి దేశంలో మెడికల్ విద్యను అభ్యసించలేని విద్యార్థులు, తక్కువ ఖర్చుతో విదేశాల్లో చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య..
Indian students studying medicine abroad: లక్షలు పోసి దేశంలో మెడికల్ విద్యను అభ్యసించలేని విద్యార్థులు, తక్కువ ఖర్చుతో విదేశాల్లో చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య (Medical Education) నానాటికీ పెరుగుతోంది. విదేశాల్లో ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసినట్లు రాష్ట్రంలోని వైద్యమండలి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థుల్లో చైనా, ఉక్రెయిన్‌లలో చదివినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. గతేడాది జనవరి 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ మధ్య 644 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వీరిలో 245 మంది విద్యార్థినులు ఉండడం గమనార్హం. ఈ 644 మందిలో చైనాలో 164, ఉక్రెయిన్‌లో 126 మంది చొప్పున ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారున్నారు.
ఆతర్వాత కిర్గిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు విద్యార్థులు ప్రాధాన్యమిచ్చారు. మొత్తం 16 దేశాలకు ఏపీ విద్యార్థులు వెళ్లారు. దేశంలో ఎంబీబీఎస్ విద్య పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చుకంటే విదేశాల్లో అయ్యే ఖర్చు తక్కువగా ఉండటంవల్ల విద్యార్థులు ఇటువైపు దృష్టి పెడుతున్నారు. చైనాలో చదివి పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 61 మంది విద్యార్థినులు ఉన్నారు. ఉక్రెయిన్ నుంచి వైద్య పట్టా పొందిన 126 మందిలో 40 మంది అమ్మాయిలు ఉన్నారు. కిర్గిస్థాన్‌లో 92కు 33, ఫిలిప్పీన్స్‌లో 104కు 50, అర్మేనియాలో 20 మందికి 11 మంది చొప్పున విద్యార్థినులు ఉన్నారు. కెనడా, సెంట్రల్ అమెరికా, జార్జియా, నేపాల్, సెయింట్ లుసియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇతర దేశాల్లోనూ తెలుగు విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తిచేశారు.
Also Read: