AP KGBV Admissions 2022: కేజీబీవీల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..

మే 22వ తేదీ వరకు అర్హులైన బాలికలు తమ ప్రవేశ దరఖాస్తులను ఆన్‌లైన్‌ (online application)లో నమోదు చేసుకోవచ్చు. 2022-23 విద్యా సంవత్సరంలో ఒక్కో విద్యాలయంలో 40 మంది..

AP KGBV Admissions 2022: కేజీబీవీల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..
Ap Kgbv Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: May 09, 2022 | 9:17 AM

AP KGBV 6th Class Admissions 2022: విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం రంగాపురం, ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తూ సమగ్ర శిక్ష అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మే నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. మే 22వ తేదీ వరకు అర్హులైన బాలికలు తమ ప్రవేశ దరఖాస్తులను ఆన్‌లైన్‌ (online application)లో నమోదు చేసుకోవచ్చు. 2022-23 విద్యా సంవత్సరంలో ఒక్కో విద్యాలయంలో 40 మంది బాలికలకు ఆరో తరగతిలో ప్రవేశాలకు అనుమతిస్తారు. ఆయా కేజీబీవీ (AP KGBV)ల్లో 7, 8 తరగతుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎ.కొండూరు విద్యాలయంలో మాత్రమే 7లో 4, 8లో 1 ఖాళీలు ఉన్నాయి.

కేజీబీవీల్లో అనాధ, తల్లీ లేక తండ్రి లేని పిల్లలు, బడి బయట బాలికలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదరికానికి చెందిన విద్యార్థినులకు అవకాశం కల్పిస్తారు. అర్హులైన బాలికల ప్రవేశాలకు ప్రత్యేకాధికారిణిలు, బాలికాభివృద్ది అధికారిణిలు పూర్తి బాధ్యత వహిస్తారు. బడి బయట, మధ్యలో బడి మానేసిన బాలికలను గుర్తించేందుకు మండల స్థాయి అధికారులతో పాటు విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది కూడా కీలకంగా ఉంటారు. దరఖాస్తుదారులు తమ సందేహాల నివృత్తికి 92998 58518 (ఎ.కొండూరు), 86888 90621 (రంగాపురం), 74166 76311 (పెదకొమిర) చరవాణి నంబర్లలో ప్రత్యేకాధిÅకారిణులను సంప్రదించవచ్చు.

Also Read:

Medical Education: మన దేశంలో చైనా ఎంబీబీఎస్‌లే ఎక్కువ! ఏకంగా 16 దేశాల్లో మెడిసిన్‌ చదువుతున్న తెలుగు విద్యార్థులు..