TS govt Jobs 2022: తెలంగాణ వర్సిటీల్లో కోచింగ్‌ క్లాసులు షురూ! నేడే ప్రారంభం..

|

Apr 20, 2022 | 7:08 AM

రాష్ట్రంలో భర్తీ చేయనున్న 80,039 ఉద్యోగాలకు నిర్వహించనున్న పోటీ పరీక్షలకు కోచింగ్ తరగతులు ఏర్పాటు చేయాలని తెలంగాణ యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఈ రోజు (ఏప్రిల్ 20న) మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పద్ధతిలో..

TS govt Jobs 2022: తెలంగాణ వర్సిటీల్లో కోచింగ్‌ క్లాసులు షురూ! నేడే ప్రారంభం..
Coaching Classes
Follow us on

6 Telangana univarsities will set up coaching classes for competitive examinations: రాష్ట్రంలో భర్తీ చేయనున్న 80,039 ఉద్యోగాలకు నిర్వహించనున్న పోటీ పరీక్షలకు కోచింగ్ తరగతులు ఏర్పాటు చేయాలని తెలంగాణ యూనివర్సిటీలు నిర్ణయించాయి. విద్యార్థులను వివిధ పోటీ పరీక్షల్లో రాణించేలా ఈ కోచింగ్ క్లాసులు సన్నద్ధం చేయనున్నాయి. మొత్తం 6 యూనివర్సిటీలు కోచింగ్ క్లాసులను నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడంతో.. నిరుద్యోగులందరూ కోచింగ్‌ల బాటపట్టారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో కూడా ఉచిత కోచింగ్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకట రమణ ఈ రోజు (ఏప్రిల్ 20న) మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పద్ధతిలో కోచింగ్ క్లాసులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

కాగా తెలంగాణ ఆర్థిక శాఖ తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు ఇవ్వగా, ఫైర్ సర్వీస్, ఎక్సైజ్, ప్రొహిబిషన్, ఫారెస్ట్రీ విభాగాలకు చెందిన మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు అనుమతినిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్ధులు భారీ స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read:

CMFRI Kochi Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగావకాశాలు..