హైదరాబాద్, ఆగస్టు 8: టీఎస్పీయస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలు ప్రకటించిన తర్వాత మెయిన్ పరీక్షలకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని కమిషన్ భావిస్తోంది. ఐతే ప్రిలిమినరీ పరీక్షకు తుది కీ ఇప్పటికే వెల్లడించినప్పటికీ ఫలితాల ప్రకటనకు మాత్రం పలు న్యాయ వివాదాలు అడ్డుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో జీవో నం 55పై, రోస్టర్‌పై దాఖలైన పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఈ వివాదాలపై వచ్చే వారం హైకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. అడ్డంకులు తొలగిపోయిన వెంటనే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించడానికి కమిషన్ కసరత్తు చేస్తోంది. అనంతరం మెయిన్ పరీక్షల షెడ్యూల్ త్వరలో ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 8,180 గ్రూప్-4 పోస్టులకు జూలై 1న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యప్తంగా దాదాపు 7.6 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని వచ్చే వారంలో వెలువరించేందుకు టీఎస్పీయస్సీకసరత్తు పూర్తిచేసింది. ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. అనంతరం త్వరలోనే ఫలితాలు కూడా వెల్లడించనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.