TS Gurukula Jobs: తెలంగాణ టీజీటీ అభ్యర్థుల టెట్‌ స్కోర్‌ నమోదుకు అవకాశం.. ఈ రోజు సాయంత్రంతో ముగుస్తోన్న గడువు

|

Feb 21, 2024 | 1:38 PM

తెలంగాణలో ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ టెట్‌ స్కోర్‌ సమాచారాన్ని ఈ నెల 21వ తేదీ సాయంత్రంలోగా అప్‌డేట్‌ చేసుకునేందుకు గురుకుల పాఠశాలల నియామక బోర్డు అవకాశం ఇచ్చింది. గడువు ముగిసిన తరువాత ఈ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నారు. వారందరికీ సర్టిఫికెట్లను పరిశీలిస్తామని ఓ ప్రకటనలో తెలింది..

TS Gurukula Jobs: తెలంగాణ టీజీటీ అభ్యర్థుల టెట్‌ స్కోర్‌ నమోదుకు అవకాశం.. ఈ రోజు సాయంత్రంతో ముగుస్తోన్న గడువు
TS Gurukula Jobs
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21: తెలంగాణలో ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ టెట్‌ స్కోర్‌ సమాచారాన్ని ఈ నెల 21వ తేదీ సాయంత్రంలోగా అప్‌డేట్‌ చేసుకునేందుకు గురుకుల పాఠశాలల నియామక బోర్డు అవకాశం ఇచ్చింది. గడువు ముగిసిన తరువాత ఈ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నారు. వారందరికీ సర్టిఫికెట్లను పరిశీలిస్తామని ఓ ప్రకటనలో తెలింది. సర్టిఫికెట్లను పరిశీలన అనంతరం 4,020 పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించనుంది.

శాతవాహన విశ్వవిద్యాలయం లా పరీక్షల ఫలితాలు విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ (5వ సెమిస్టర్‌) పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీరంగప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో www.satavahana.ac.in. అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే ఎల్‌ఎల్‌బీ మూడో సెమిస్టర్‌ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షలకు ఫిబ్రవరి 29 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చినట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీరంగప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో మార్చి 4 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

సైనిక గురుకులంలో 2024-25 ప్రవేశాలకు దరఖాస్తులు

తెలంగాణలోని చొప్పదండి మండలంలోని రుక్మాపూర్‌ సైనిక బాలుర గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులకు మార్చి 1వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. మార్చి 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ ప్రారంభమవుతుందని అన్నారు. మార్చి 10న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఎంపికైన వారికి మిలిటరీ కోచింగ్‌తోపాటు సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్యాభ్యాసం ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు http://tswrsplschool.gov.in/వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.