తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్ట్‌లకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేట స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం మే 14 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. కనీసం 55 శాతం మార్కులతో సంబంధి సబ్జెక్టులో ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్ (సీఎస్ఈ, ఐటీ).. వంటి ఏదైనా మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసేందుకు గరిష్ఠ వయోపరిమితి అంటూ ఏమీ ఉండదు. ఏ వయసు వారైనా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ సెట్ 2024 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్ 2లో 100 ప్రశ్నలకు గానూ 200 మార్కులు కేటాయిస్తారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షను మొత్తం 3 గంటల్లో నిర్వహిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.