AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Staff Nurse Exam Date: నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ వెల్లడి.. త్వరలోనే హాల్‌ టికెట్లు

తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీ విడుదలైంది. మొత్తం 2050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలోనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు MHSRB వెల్లడించింది..

TG Staff Nurse Exam Date: నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ వెల్లడి.. త్వరలోనే హాల్‌ టికెట్లు
TG Staff Nurse Exam
Srilakshmi C
|

Updated on: Nov 03, 2024 | 7:19 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో నర్సింగ్‌ ఆఫీసర్ల (స్టాఫ్‌నర్సుల) పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఈ నెలలోనే జరగనుంది. నవంబర్ 23న నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఈ ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఈ పరీక్షను నవంబర్‌ 17వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తామని MHSRB ప్రకటిచింది. అయితే కొన్ని కారణాల రిత్య ఈ పరీక్ష తేదీలో మార్పు చేసింది. ఈ మేరకు పరీక్ష నవంబర్‌ 23న పరీక్ష నిర్వహణకు సమాయత్తమవుతోంది. మొత్తం 2050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సెస్టెంబర్‌ నెలలో ఈ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ జరిగింది. మొత్తం పోస్టుల్లో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధిలో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలో 332 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 80 పోస్టులు, ఆయుష్‌లో 61 పోస్టులు, ఐపీఎంలో ఒకటి చొప్పున స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేస్తారు.

నవంబరు 23న నిర్వహించనున్న నర్సింగ్‌ ఆఫీసర్‌ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు త్వరలోనే విడుదల కానున్నాయి. హైదరాబాద్‌ సహా 13 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. 80 మార్కులకు రాతపరీక్ష జరుగుతుంది. మిగిలిన 20 మార్కులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు వెయిటేజీ కింద కేటాయిస్తారు.

నవంబరు 14 నుంచి తెలంగాణ వార్డెన్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్‌ పోస్టుల భర్తీకి నవంబరు 14 నుంచి 30 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్‌ ఇ నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ఇటీవల రాతపరీక్షలు నిర్వహించగా.. వారిలో మెరిట్‌ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా ప్రకటించారు. ఇక దివ్యాంగ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెలువరించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీలో సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. ఈ షెడ్యూలు ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకాలేని వారికి డిసెంబరు 2 నుంచి 4 వరకు రిజర్వుడేగా ప్రకటించామని వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించిన వారందరూ నవంబరు 13 నుంచి డిసెంబరు 4 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.