Telangana SSC Fake Websites: తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు పేరిట నకిలీ వెబ్‌సైట్లు.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు

|

Jan 21, 2024 | 4:46 PM

తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ఎస్‌ఎస్‌సీ బోర్డు) పేరిట రెండు నకిలీ వెబ్‌సైట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ అధికారులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2023-24 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నిర్వహించేందుకు ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే..

Telangana SSC Fake Websites: తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు పేరిట నకిలీ వెబ్‌సైట్లు.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు
Telangana SSC Fake Websites
Follow us on

హైదరాబాద్‌, జనవరి 21: తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ఎస్‌ఎస్‌సీ బోర్డు) పేరిట రెండు నకిలీ వెబ్‌సైట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ అధికారులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2023-24 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నిర్వహించేందుకు ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డుకు సంబంధించిన హోమ్‌పేజీ www.bse.telangana.gov.in యూఆర్‌ఎల్‌ను ఉపయోగిస్తుంది. అయితే సరిగ్గా ఇలాంటి నకిలీ వెబ్‌సైట్‌ (యూఆర్‌ఎల్‌)లు 2 చెలామణిలో ఉన్నట్లు బోర్డు అధికారులు గుర్తించారు. నకిలీ ఎస్‌ఎస్‌సీ బోర్డు పేరుతో చెలామణి అవుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సెస్సీ బోర్డు అధికారులు సైబర్‌ పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని మీడియాకు తెలిపారు.

ప్రశాంతంగా నిర్వహించిన జవహర్‌ నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష 2024

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష జనవరి 20వ తేదీన నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీ ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్సర్‌ కీ విడుదలైన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న జేఎన్‌వీల్లో 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు జనవరి 20వ తేదీతో ముగియగా తాజాగా జనవరి 23 వరకు పొడిగిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 643 గురుకులాల్లో దాదాపు 51,924 సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 1.10 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువు తేదీ మరో 3 రోజులు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి, గురుకుల సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.