TS SSC 10th Results 2024 : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలే టాప్!

|

Apr 30, 2024 | 12:00 PM

Excerpt: TS 10th Class Result 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 30) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ సెక్రటరి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వారిలో 4,94,207 రెగ్యులర్ విద్యార్ధులు, 11,606 మంది ప్రైవేట్‌ విద్యార్ధులు ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 91.31 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ విద్యార్దుల్లో 49.73 శాతం ఉత్తీర్ణత నమోదైంది..

TS SSC 10th Results 2024 : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలే టాప్!
Telangana SSC 10th Results
Follow us on

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 30) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ సెక్రటరి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వారిలో 4,94,207 రెగ్యులర్ విద్యార్ధులు, 11,606 మంది ప్రైవేట్‌ విద్యార్ధులు ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 91.31 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ విద్యార్దుల్లో 49.73 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా గతేడాది 4,91,862 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి.

ఈ సారి కూడా పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలురు ఉత్తీర్ణత శాతం 89.42% కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 93.23% నమోదైంది. బాలికలు.. బాలురు కంటే 3.81 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రైవేట్‌ విద్యార్ధుల్లో 49.73 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. వీరిలో బాలురు 47.40 శాతం, బాలికలు 54.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్‌లో కూడా బాలురు కంటే బాలికలు 6.74 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు. ఈ సంవత్సరం 3927 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. కేవలం 6 పాఠశాలల్లో మాత్రమే జీరో పాస్‌ పర్సెంటైల్ నమోదైంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.