TS SET 2023 Last Date: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ సెట్-2023 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే

తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్‌ సెట్‌)-2023 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన సెట్ 2023 నోటిఫికేషన్ ప్రకారం ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 29వ తేదీతో తుది గడువు ముగిసింది. తాజాగా ప్రకటనలో ఎలాంటి ఆలస్య రుసుము..

TS SET 2023 Last Date: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ సెట్-2023 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
TS Set 2023 Schedule Revise

Updated on: Aug 31, 2023 | 6:27 AM

తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్‌ సెట్‌)-2023 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన సెట్ 2023 నోటిఫికేషన్ ప్రకారం ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 29వ తేదీతో తుది గడువు ముగిసింది. తాజాగా ప్రకటనలో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సిందిగా అధికారులు తెలిపారు. ఇక సెట్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కాగా ప్రతీయేట అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, డిగ్రీ కాలేజీ లెక్చర‌ర్ల ఉద్యోగాల అర్హత కోసం ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ సెట్ ప‌రీక్ష నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా సెట్ నిర్వహణకు ప్రకటన వెలువరించింది. మొత్తం జనరల్‌ స్టడీస్‌, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్ష జరుగనుంది. కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి ఏమీలేదు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ కేటగిరీ అభ్యర్ధులు రూ.2000, బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, వీహెచ్‌, హెచ్‌ఐ, ఓహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్ధులు రూ.1000 చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్‌ 4, 2023.
  • రూ.1500 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 10, 2023
  • రూ.2000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 18, 2023.
  • రూ.3000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 24, 2023.
  • ఆన్ లైన్ దరఖాస్తుల్లో సవరణ తేదీలు: 2023, సెప్టెంబర్‌ 26, 27.
  • హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌: అక్టోబర్‌ 20, 2023.
  • టీఎస్ సెట్-2023 పరీక్ష తేదీలు: 2023, అక్టోబర్‌ 28, 29, 30.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.