AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులపాటు సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

Dussehra Holidays 2026: విద్యార్థులతోపాటు ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. వచ్చే నెల ఏకంగా 13 రోజులు హాలీడేస్ రానున్నాయి. బతుకమ్మతోపాటు, దసరా పండగ కలిసిరావడంతో భారీగా సెలవులు వచ్చాయి. ఈక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలంగాణ విద్యాశాఖ కీలక అప్డేట్స్ అందించింది. 2026-27 అకడమిక్ క్యాలెండర్ మేరకు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులపాటు సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
Dussehra Festival Holidays
Venkata Chari
|

Updated on: Sep 16, 2026 | 5:56 PM

Share

Dussehra Festival Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దసర సెలవుల ప్రకటన వచ్చేసింది. వచ్చే నెల ఏకంగా 13 రోజులపాటు హాలీడేస్ రానున్నాయి. ఈమేరకు తెలంగాణ విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ లో చదువుతోన్న విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1 Exams) పరీక్షల తేదీలతోపాటు సెలవుల షెడ్యూల్ వివరాలు వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం వేర్వేరు తరగతులకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. ఒకటి నుంచి 5వ తరగతి (Class 1-5) వారికి ఉదయం 9.30 గంటల మొదలు మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల విషయానికి వస్తే తరగతుల వారీగా షెడ్యూల్ మార్పులు ఉన్నాయి. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 7వ తరగతి (Class 7) చదువుతున్న వారికి మధ్యాహ్నం వేళ పరీక్షలు జరగనున్నాయి. వీళ్లకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. తొమ్మిదో తరగతి (Class 9) విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

బతుకమ్మ, దసరా సెలవులు..

పరీక్షలు పూర్తికాగానే విద్యార్థులకు దసరా పండుగ సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు (Dasara Holidays) ఉండనున్నాయి. బతుకమ్మతోపాటు దసరా కలిసి రావడంతో మొత్తంగా 12 రోజుల పాటు సెలవులు కేటాయించారు. పండుగ సెలవులు ముగిసిన వెంటనే పాఠశాలలు 23 నుంచి యథావిధిగా పునఃప్రారంభమవుతాయి.

అక్టోబర్ 10.. దసరా సెలవులు మొదలు.

అక్టోబర్ 11.. బతుకమ్మ ప్రారంభం..

అక్టోబర్ 19.. సద్దుల బతుకమ్మ..

అక్టోబర్ 20.. విజయదశమి..

అక్టోబర్ 22.. దసరా సెలవులు సమాప్తం

అక్టోబర్ 23.. స్కూల్స్ తిరిగి ప్రారంభం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్ నుంచి సూపర్ టూర్.. పూరీ, కోణార్క్, చిలికా సహా ప్రముఖ..
హైదరాబాద్ నుంచి సూపర్ టూర్.. పూరీ, కోణార్క్, చిలికా సహా ప్రముఖ..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులపాటు సెలవులు
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులపాటు సెలవులు
ప్రత్యేక ఆకర్షణగా 'ఎకో గణపతి'..500 kg కూరగాయలతో శాకాంబరీ అలంకరణ
ప్రత్యేక ఆకర్షణగా 'ఎకో గణపతి'..500 kg కూరగాయలతో శాకాంబరీ అలంకరణ
ఇరాన్‌పై యుద్ధం.. అమెరికా ఖజానాకు బిగ్ షాక్!
ఇరాన్‌పై యుద్ధం.. అమెరికా ఖజానాకు బిగ్ షాక్!
500 మందికి పులిహోర.. ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!
500 మందికి పులిహోర.. ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!
అక్క చేతిలో ఐఫోన్ నొక్కేసిన కోతి..కట్ చేస్తే జ్యూస్ ఆఫర్‌తో సీన్
అక్క చేతిలో ఐఫోన్ నొక్కేసిన కోతి..కట్ చేస్తే జ్యూస్ ఆఫర్‌తో సీన్
వినాయకుడికి ఇష్టమైన శెనగల ప్రసాదం.. 250 మందికి సరిపోయేలా
వినాయకుడికి ఇష్టమైన శెనగల ప్రసాదం.. 250 మందికి సరిపోయేలా
ఈ సినిమా ఉంటది రా చారి.. ఓటీటీలో రచ్చ చేస్తున్న 19 ఏళ్ల నాటి మూవీ
ఈ సినిమా ఉంటది రా చారి.. ఓటీటీలో రచ్చ చేస్తున్న 19 ఏళ్ల నాటి మూవీ
కోట్ల ఏళ్ల రహస్యం.. పెట్రోల్ అరబ్ దేశాల్లోనే ఎందుకుంటుంది.. ?
కోట్ల ఏళ్ల రహస్యం.. పెట్రోల్ అరబ్ దేశాల్లోనే ఎందుకుంటుంది.. ?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.!
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.!