హైదరాబాద్, మే 1: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) 2024 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ పుల్లయ్య ప్రకటన వెలువరించారు. రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువు మే 30వ తేదీతో ముగియగా.. మే 7వ తేదీ వరకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వానియోగం చేసుకుని, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కాగా పాలీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22వ తేదీతో ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు. తాజా ప్రకటనతో రూ.100 ఆలస్య రుసుంతో మే 7వ తేదీ వరకు, రూ.300 ఆలస్య రుసుంతో మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మే 24వ తేదీన పాలీసెట్ 2024 పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పాలీసెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర వివరాలను మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లేదా అధికారిక వెబ్‌సైట్ లో తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ వెల్లడించారు. ర్యాంకు కార్డు, మార్కుల జాబితా కోసం అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.