TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై రాత పరీక్ష.. తగ్గిన హాజరుశాతం..

|

Mar 27, 2023 | 12:56 PM

తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మార్చి 26 (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పోలీస్‌ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో ఈ పరీక్ష..

TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై రాత పరీక్ష.. తగ్గిన హాజరుశాతం..
TSLPRB SI Exam
Follow us on

తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మార్చి 26 (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పోలీస్‌ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 975 మంది ఈ పరీక్షకు అర్హతసాధించగా ఆదివారం జరిగిన పరీక్షకు 594 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే 60.92 శాతం హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్‌, డిజిటల్‌ వేలిముద్రల్ని అధికారులు సేకరించారు.

ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని త్వరలోనే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు బోర్డు ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ ను చెక్‌ చేసుకోవచ్చు. రాత పరీక్షకు సంబంధించి మిగిలిన రెండు పేపర్ల హాల్ టిక్కెట్లు విడివిడిగా జారీ చేస్తామని, పరీక్ష తేదీలను త్వరలో బోర్డు ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.