TG Anganwadi Jobs 2025: తెలంగాణలో 14 వేలకుపైగా అంగన్వాడీ ఉద్యోగాలు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Telangana Anganwadi Jobs 2025: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 14 వేలకుపైగా అంగన్‌వాడీ పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారులను..

TG Anganwadi Jobs 2025: తెలంగాణలో 14 వేలకుపైగా అంగన్వాడీ ఉద్యోగాలు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
Telangana Anganwadi Jobs

Updated on: Oct 29, 2025 | 4:34 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 29: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 14 వేలకుపైగా అంగన్‌వాడీ పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. పోస్టుల నియామకాలకు అడ్డుగా ఉన్న సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేసేందుకు లీగల్‌గా చర్యలు స్పీడప్ చేయాలని, పది రోజుల్లోగా రిక్రూట్మెంట్‌కు లైన్ క్లియర్ చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో ఎస్టీలకు 100 శాతం కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్‌ పిటిషన్‌ వేయాలని తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం (అక్టోబర్‌ 28) మంత్రి సీతక్క సమావేశం నిర్వహించి న్యాయ చిక్కులపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని ఎలా అదిగమించాలనేదానిపై అధికారులను అడిగి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో లా సెక్రటరీ బీ పాపిరెడ్డి, పీఆర్సీ చైర్మన్‌ ఎన్‌ శివ శంకర్‌, డైరెక్టర్‌ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేయనున్న నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్‌, హెల్పర్‌ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్‌ చేయడంతో రిజర్వేషన్లు 50 శాతం మించి పోయాయి. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ విధానాన్నిఅధ్యయనం చేసిన అధికారులు.. దీనిపై తయారు చేసిన రిపోర్టును మంత్రికి అందించారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50 శాతం రిజర్వేషన్‌ రూల్‌ పాటించడంలేదనీ అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఈ‌‌‌‌‌‌‌ రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ అంగన్వాడీ రిక్రూట్‌మెంట్‌ను అమలు చేసి, సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయించాలని, అందుకు వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలని అధికారులను మంత్రి సీతక్కఆదేశించారు. అనంతరం 10 రోజుల్లోగా నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలన్నారు. అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేయడానికి ఈ కొత్త నియామకాలు వెంటనే పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.