TG LAWCET: తెలంగాణలో లాసెట్‌, పీజీఎల్ సెట్‌ ఫలితాల డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే!

తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ ఉన్నతవిద్యా మండలి ఈ ఫలితాలను విడదల చేయనుంది. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ప్రైమరీ కీ విడుదల చేసిన అధికారులు..బుధవారం పూర్తి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ఈ నెల 6న జరిగిన లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలకు 45 వేలమంది అభ్యర్థులు హాజరయ్యారు.

TG LAWCET: తెలంగాణలో లాసెట్‌, పీజీఎల్ సెట్‌ ఫలితాల డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే!
Lawcet

Edited By: Anand T

Updated on: Jun 24, 2025 | 6:34 PM

తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 3.30కి విడుదల చేయనున్నట్లు ఉన్నతవిద్యా మండలి ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ప్రైమరీ కీ విడుదల చేసిన అధికారులు. బుధవారం మధ్యాహ్నం పూర్తి ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్ సహా పలువురు అధికారులు హైయర్ ఎడ్యూకేషన్ కార్యాలయంలో రిజల్ట్ రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 6న జరిగిన లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలకు 45 వేలమంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే బుధవారం ఫలితాల విడుదల నేపథ్యంలో మూడేళ్లు, ఐదేళ్ల లాసెట్, పీజీఎల్ సెట్ అభ్యర్థులకు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు.

ఫలితాలు చూసుకునేందుకు అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థికి ర్యాంకుతో పాటు పూర్తి మార్కులు ఫలితాల్లో వెలువడుతాయి. మార్కులు, సెక్షన్ల వారీగా మార్కులు, క్వాలిపై అయ్యారా లేదా అన్నది ఫలితాల్లో చూపిస్తారు. ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లో ఫలితాలతో పాటు టాప్ టెన్ ర్యాంకుల అభ్యర్థుల జాబితా లాసెట్ మూడేళ్లు, ఐదేళ్లతో పాటు పీజీఎల్ సెట్ వారి జాబితా ప్రకటించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..