TS Law CET 2024 Schedule: తెలంగాణ లాసెట్‌, పీజీలాసెట్‌ 2024 షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్‌

|

Feb 09, 2024 | 5:50 PM

లా కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురు చేస్తున్న విద్యార్ధులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీపికబురు చెప్పింది. తెలంగాణ లాసెట్‌ 2024, పీజీఎల్‌సెట్‌ 2024 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదల చేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన హెడ్యూల్‌ విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం తెలంగాణ లా సెట్, PGLCET నోటిఫికేషన్‌లను ఫిబ్రవరి 28 న విడుదల చేయనుంది..

TS Law CET 2024 Schedule: తెలంగాణ లాసెట్‌, పీజీలాసెట్‌ 2024 షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్‌
TS Law CET 2024 Schedule
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9: లా కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురు చేస్తున్న విద్యార్ధులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీపికబురు చెప్పింది. తెలంగాణ లాసెట్‌ 2024, పీజీఎల్‌సెట్‌ 2024 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదల చేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన హెడ్యూల్‌ విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం తెలంగాణ లా సెట్, PGLCET నోటిఫికేషన్‌లను ఫిబ్రవరి 28 న విడుదల చేయనుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది. ఆలస్య రుసుముతో మే 25వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్ 3వ తేదీన రెండు షిఫ్టుల్లో రాత పరీక్ష ఉంటుంది. మొదటి షిఫ్టు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్టు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.

కాగా మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జాం ప్యాట్రన్‌, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెస్‌, ఎగ్జాం సెంటర్స్‌, ర్యాంకింగ్‌, సిలబస్‌ వంటి ఇతర వివరాలు నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఈ సారి ఎల్‌ఎల్‌ఎం కోర్సులో కొద్ది మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త సిలబస్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో www.lawcet.tsche.ac.inలో చెక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.