తెలంగాణ రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్యలో 71 లైబ్రేరియన్ (కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లైబ్రరీ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్ సైన్స్ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే యూజీసీ నెట్/స్లెట్/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 10, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రూ.320లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 2023 మే/జూన్ నెలలో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు ఏవో పోస్టులకు రూ.54,220ల నుంచి రూ.1,33,630ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.