TS Inter supply Results: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ బోర్డ్ సెక్రటీర జలీల్ మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ఈ అడ్వాన్స్ సప్లిమంటరీ పరీక్షలకు మొత్తం 1,14,289 మంది హాజరుకాగా, సప్లిమెంటరీ జనరల్ పాస్ పర్సంటేజ్ 47.74%గా ఉండగా ఒకేషనల్ 65.07% ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంటర్ మెయిన్, సప్లీలో కలిసి మొత్తం 80.80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు మంగళవారం సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 4,64,626 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఫస్టియర్‌లో 2,94,378 మంది ఉత్తీర్ణులు కాగా సెకండియర్‌లో 2,95,949 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..