Telangana Inter Supplementary Exams 2022: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు జులై 6వ తేదీతో ముగియనుండగా.. మరో రెండు రోజులకు గడువును పెంచుతూ ఇంటర్ బోర్డు ప్రకటించింది. జులై 8 (శుక్రవారం) వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజులు ఆయా జూనియర్ కాలేజీల ద్వారా చెల్లించుకోవచ్చని ఈ సందర్భంగా తెల్పింది. కాగా అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్ధులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి 5 గంటల 30 నిముషాల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఇక ప్రాక్టికల్స్‌లో ఫెయిలైన విద్యార్ధులకు జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెల్పింది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఆగస్టు నెలాఖరు నాటికి ప్రకటించనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.