TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం.. రేపే రిజల్ట్స్‌, ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

TS Inter Results: తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల నిరీక్షణకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ పరీక్షా ఫలితాలు ఎట్టకేలకు విడుదలవుతున్నాయి. గతంలో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన...

TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం.. రేపే రిజల్ట్స్‌, ఎలా చెక్‌ చేసుకోవాలంటే..
AP EAPCET 2022 Key

Edited By: Anil kumar poka

Updated on: Jun 28, 2022 | 1:17 PM

TS Inter Results: తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల నిరీక్షణకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ పరీక్షా ఫలితాలు ఎట్టకేలకు విడుదలవుతున్నాయి. గతంలో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ రిజల్ట్స్‌ను రేపు (జూన్‌ 28వ) విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.   అలాగే టీవీ9 తెలుగు వెబ్ సైట్ (https://tv9telugu.com/)లోనూ తెలుసుకోవచ్చు.

ఇంటర్ ఫలితాల విషయమై ఈ విషయమై తెలంగాణ ఇంటర్ బోర్డ్‌ ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు. వీరిలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌తో పాటు వొకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1443 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఫలితాలు విడుదలువుతోన్న నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురైనా, ఇతర సమ‌స్యల పరి‌ష్కా‌రా‌నికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించ‌వ‌చ్చని అధికారులు చెబుతున్నారు. ఇంటర్‌ రెండు ఏడాదుల ఫలితాలు ఒకేసారి విడుదలకానున్నాయి. అలాగే పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈనెల 30న లేదా జూలై 1వ తేదీన విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..