తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రాత పరీక్ష 80 మార్కులకే నిర్వహించి, ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. కాగా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌లో భౌతికశాస్త్రం, రసాయన, జీవ, వృక్ష శాస్త్రాలతో పాటు ఒకేషనల్ కోర్సుల్లో మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. ఇక నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ ప్రవేశపెడుతున్నట్లు బోర్డు నిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాలల తరగతులు ప్రారంభమయ్యే నాటికి ప్రాక్టికల్స్‌పై ఇంటర్ బోర్డు స్పష్టత ఇవ్వనుంది.
గత నవంబరులో జరిగిన ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశంలో కొన్ని సంస్కరణలు అమలుచేయాలని నిర్ణయించింది. అందులో ఇంగ్లిషులో ప్రాక్టికల్స్ అమలు చేయడం కూడా ఉంది. విద్యార్ధుల్లో ఇంగ్లిస్ స్కిల్స్ పెంపొందిచాలని, తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్స్‌కు సిలబస్ కూర్పుపై భాషా నిపుణులతో బోర్డు అధికారులు చేసిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. అందుకు సంబంధించిన పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు వైవా తరహాలోనే ఈ పరీక్ష ఉంటుంది. ఇంటర్ స్థాయిలో క్లాస్ రూంలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు.
ఇంటర్‌లో ద్వితీయ భాష సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, హిందీ తదితరాల సిలబస్ మార్చాల్చి ఉండగా కొన్ని కారణాల రిత్య ఈ ఏడాది (2023-24) ద్వితీయ భాషను పాత సిలబస్ ప్రకారమే బోధించనున్నారు. మరోవైపు ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు ఒకే స్థాయి గణితం సిలబస్ అమలుచేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం నుంచి మార్చాలని భావించినా ఈ సారి కుదరట్లేదని బోర్డు తెల్పింది. కామర్స్‌లో కూడా ఏమార్పు చేయబోవట్లేదని వెల్లడించింది. కొత్త కోర్సుగా సీఈఏ (కామర్స్, ఎకనామిక్స్, అకౌంటింగ్) గ్రూపు కూడా ఈ విద్యాసంవత్సరం అమలు చేయడం లేదని పేర్కొంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.