TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్స్‌ గడువు పెంచుతూ నిర్ణయం.

|

Jul 08, 2021 | 7:25 PM

TS Inter: తెలంగాణ ఇంటర్‌ అడ్మిషన్లకు సంబంధించిన బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం కోసం నిర్వహించే అడ్మిషన్‌ ప్రక్రియ గడువును పెంచుతూ బోర్డు అధికారిక ప్రకటన..

TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్స్‌ గడువు పెంచుతూ నిర్ణయం.
Ts Inter First Year Admissions
Follow us on

TS Inter: తెలంగాణ ఇంటర్‌ అడ్మిషన్లకు సంబంధించిన బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం కోసం నిర్వహించే అడ్మిషన్‌ ప్రక్రియ గడువును పెంచుతూ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గడువు ఈ నెల 31 పొడగిస్తూ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ గురువారం ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి జలీల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కాలేజీలు నిబంధనలను తూచాతప్పకుండా పాటించాలని జలీల్‌ ఆదేశించారు. కొన్ని కాలేజీలు అనుమతి లేకుండానే ప్రవేశాలు చేపట్టాయని ఫిర్యాదులు వచ్చాయని తెలిపిన జలీల్‌.. నిబంధనలను పాటించని కళాశాలలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎవరూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించకూడదని ఆదేశించారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలోనే రాష్ట్రంలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో విద్యా బోధన కొనసాగుతోంది.

యథావిధిగా డిగ్రీ పరీక్షలు..

ఇదిలా ఉంటే తెలంగాణలో పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. డిగ్రీ ఎగ్జామ్స్ యథావిధిగా కొనసాగుతాయని బుధవారం తెలిపింది. రాష్ట్రంలో ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఉన్నత విద్యా మండలి అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేసి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ ప్రకటన చేసింది. పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని, యథావిధిగా ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు జరుగుతాయని అధికారులు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే.. మంగళవారం తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్దుల పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Prashant Kishor: వాట్ ఈజ్ నెక్ట్స్? ప్రశాంత్ కిషోర్ ఆ రాష్ట్ర సీఎం కోసం పనిచేయబోతున్నారా?

Bigil Movie – Lifesaver-ప్రమాదంలో గాయపడిన బాలుడికి .. బిగిల్ మూవీ చూపించి ఆపరేషన్ చేసిన వైద్యులు

Viral Photo: మిస్టర్‌ కూల్‌ ధోని ఈ ఫొటోలో ఉన్నాడు.. గుర్తు పట్టగలరా.? ఓసారి ప్రయత్నించండి చూద్దాం.