TS ICET 2023: తెలంగాణ ఐసెట్‌ రిపోర్టింగ్‌ గడువు పెంపు..! ఓయూ, జేఎన్టీయూ పరిధిలో బీటెక్‌లో కొత్తగా ఫైనాన్స్‌ కోర్సు

|

Oct 01, 2023 | 3:50 PM

తెలంగాణ ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో తాజాగా సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. చివరి విడతలో ఆయా కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించేందుకు, రిపోర్ట్‌ చేసేందుకు గడువును పొడిగిస్తున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ వాకాటి కరుణ ప్రకటన వెలువరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గడువు తేదీ శనివారం (సెప్టెంబర్‌ 30)తో ముగియగా.. దానిని దాన్ని అక్టోబరు 6వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. కాగా ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌లో భాగంగా బీఫార్మసీ, ఫార్మాడి తదితర సీట్ల భర్తీకి స్పాట్‌ ప్రవేశాల గడువు..

TS ICET 2023: తెలంగాణ ఐసెట్‌ రిపోర్టింగ్‌ గడువు పెంపు..! ఓయూ, జేఎన్టీయూ పరిధిలో బీటెక్‌లో కొత్తగా ఫైనాన్స్‌ కోర్సు
Telangana ICET 2023
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: తెలంగాణ ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో తాజాగా సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. చివరి విడతలో ఆయా కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించేందుకు, రిపోర్ట్‌ చేసేందుకు గడువును పొడిగిస్తున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ వాకాటి కరుణ ప్రకటన వెలువరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గడువు తేదీ శనివారం (సెప్టెంబర్‌ 30)తో ముగియగా.. దానిని దాన్ని అక్టోబరు 6వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. కాగా ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌లో భాగంగా బీఫార్మసీ, ఫార్మాడి తదితర సీట్ల భర్తీకి స్పాట్‌ ప్రవేశాల గడువు సెప్టెంబర్‌ 30తో ముగిసిన సంగతి తెలిసిందే.

బీటెక్‌లో ఫైనాన్స్‌ కోర్సు.. ఓయూ, జేఎన్టీయూ పరిధిలో అమలు

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ ప్రోగ్రాముల్లో సాంకేతిక విద్యను విద్యాశాఖ కొత్త పుంతలు తొక్కిస్తుంది. తాజాగా బీటెక్‌లోనూ ఫైనాన్స్‌ కోర్సును అంతర్భాగంగా చేరుస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఈ, బీ టెక్‌ ప్రోగ్రాముల్లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ ఈ మేరకు 2023-24 విద్యాసంవత్సరం నుంచి లేదా వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమల్లోకి తెస్తు్న్నట్లు ప్రకటించారు. దీంట్లో భాగంగా బీటెక్‌ స్పెషలైజేషన్‌ను మేజర్‌గా, ఫై నాన్షియల్‌ సర్వీసెస్‌ను మైనర్‌ కోర్సుగా విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓయూ, జేఎన్టీయూ పరిధిలో ఈ కోర్సును అమలు చేయనున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం బ్యాకింగ్‌ అం డ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం హవా నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యార్ధుల కోసం ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో అధిక మంది విద్యార్ధులు వాణిజ్యశాస్త్రం, అర్థశాస్త్రం కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. బీకాం, బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సుల్లో అధిక మంది ప్రవేశం పొందుతుండగా.. దానిని తాజాగా బీటెక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోర్సును కూడా కొత్తగా ప్రవేశ పెట్టాలని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

బ్యాంకింగ్‌ రంగంలో పనిచేయాలన్న ఆసక్తి గల బీటెక్‌ విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకుని చదవవచ్చు. నాలుగేళ్లు పూర్తైన తర్వాత బీటెక్‌ పట్టాతో పాటే మైనర్‌ కోర్సు పట్టా అందజేస్తారు. బీటెక్‌ ప్రోగ్రాముల్లోని అన్ని బ్రాంచీల విద్యార్థులు మూడో ఏడాది మొదటి సెమిస్టర్‌లో మైనర్‌గా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోర్సును ఎంచుకోవచ్చు. ఈ సబ్జెక్టులను ఎనిమిదో సెమిస్టర్‌లోగా పూర్తి చేయవల్సి ఉంటుంది. ఈ కోర్సును ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీ, సీబీఐటీ వంటి అటానమస్‌ కాలేజీల్లో తొలుత ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత జేఎన్టీయూ, ఓయూ, కేయూ అనుబంధ కాలేజీలకు విస్తరించనున్నట్లు సమాచారం.ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీ అకడమిక్‌ కౌన్సిల్‌ ఈ కోర్సుకు 18 క్రెడిట్లు జారీకి నిర్ణయించింది. కోర్సులో ప్రాక్టికల్స్‌, థియరీ క్లాసులంటాయి. ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. ఈ కోర్సును ఎంచుకున్న వారు బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో పనిచేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.