TS ICET 2023: తెలంగాణ ఐసెట్-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

|

Mar 01, 2023 | 1:24 PM

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) ఇప్పటివరకు 13 సార్లు ఐసెట్‌ను నిర్వహించిందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి..

TS ICET 2023: తెలంగాణ ఐసెట్-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
TS ICET 2023
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) ఇప్పటివరకు 13 సార్లు ఐసెట్‌ను నిర్వహించిందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా కేయూ యూనివర్సిటీ పరిధిలోనే ఐసెట్‌ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నోటిఫికేషన్‌ ప్రకారం.. మే 26, 27 తేదీల్లో ప్రవేశపరీక్షలు జరుగుతాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మే 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవడానికి మే 12 నుంచి 18 వరకు అవకాశం ఉంటుంది. ఇక మే 22 నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మే 26, 27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. ఆన్సర్‌ కీ జూన్‌ 5న విడుదల అవుతుంది. జూన్‌ 20న ఫలితాలను విడుదల చేస్తారు. పూర్తి వివరాలను ఐసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌  లో చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఐసెట్‌ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.