TS Health Dept Recruitment 2022: తెలంగాణ వైద్య శాఖలో 1326 ఉద్యోగాలు.. జులై 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం..

|

Jul 08, 2022 | 9:15 AM

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TS Health Department).. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, ట్యూటర్ తదితర పోస్టుల (Civil Assistant Surgeon Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ..

TS Health Dept Recruitment 2022: తెలంగాణ వైద్య శాఖలో 1326 ఉద్యోగాలు.. జులై 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం..
Telangana
Follow us on

TS Health Department Medical Civil Assistant Surgeon Recruitment 2022: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TS Health Department).. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, ట్యూటర్ తదితర పోస్టుల (Civil Assistant Surgeon Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 1326

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ (పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టరేట్‌) పోస్టులు: 751
  • ట్యూటర్ల (మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌) పోస్టులు: 357
  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ (జనరల్‌/జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్) పోస్టులు: 211
  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌) పోస్టులు: 7

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్:

  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టులకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050
  • ట్యూటర్ పోస్టులకు నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.200

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 15, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14, 2022 సాయంత్రం 5 గంటల వరకు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.