Sankranti Holidays 2025: స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ! ఎప్పట్నుంచంటే

| Edited By: Ram Naramaneni

Jan 05, 2025 | 5:31 PM

బడికెళ్లే పిల్లలకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు సంక్రాంతి హాలిడేస్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లేందుకు ఇక బ్యాగులు రెడీ చేసుకోవచ్చు. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి. సెలవులు తేదీలపై పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Sankranti Holidays 2025: స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ! ఎప్పట్నుంచంటే
Sankranti Holidays
Follow us on

హైదరాబాద్‌, జనవరి 5: సంక్రాంతి పండక్కి ప్రతీ యేట రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి కూడా విద్యాశాఖ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు సంక్రాంతి సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది.  జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు(జనవరి 11 రెండో శనివారం, 12న ఆదివారం)  వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 18వ తేదీన మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. ఇక జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది.

ఇటీవల ముగిసిన క్రిస్మస్‌ సెలవుల్లో స్కూళ్లకు అదనంగా మూడు రోజుల సెలవు అదనంగా వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సింగ్‌డే, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణంతో డిసెంబర్‌ చివరలో వరుసగా మూడురోజులు సెలవులొచ్చాయి. విద్యార్థులు సెలవుల నుంచి తేరుకునే లోపే మళ్లీ సంక్రాంతి సెలవులొచ్చేశాయి. ఇక జనవరి 18 (శనివారం) పాఠశాలలు తిరిగి తెరుచుకున్నా.. 19న ఆదివారం కావడంతో మళ్లీ సెలవొచ్చింది.

ఇక సంక్రాంతి సెలవు తర్వాత పాఠశాల విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్థులకు జనవరి 29లోగా, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28లోగా ఈ పరీక్షలు నిర్వహించాలని పాఠశాలలకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు జనవరి 13 నుంచి సంక్రాంతి సెలవులు రానున్నాయి. అయితే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంకా సెలవు తేదీలను అధికారికంగా ప్రకటించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.