Telangana Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలోనే ఆ శాఖ నుంచి మొదటి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..

|

Mar 14, 2022 | 1:14 PM

Telangana Govt Jobs Alert: తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి శాసనసభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక ప్రకటన చేయడంతో నిరుద్యోగులు అలెర్ట్‌ అయ్యారు.

Telangana Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలోనే  ఆ శాఖ నుంచి మొదటి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..
Telangana Jobs
Follow us on

Telangana Police Jobs 2022: తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి శాసనసభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) కీలక ప్రకటన చేయడంతో నిరుద్యోగులు అలెర్ట్‌ అయ్యారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ పోలీసు శాఖ (Police Department) నుంచి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ( TSLPRB) కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జోన్ల వారీగా ఖాళీల జాబితాను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. దీనికి ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్‌ వెలువడే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఈ నెలాఖరున లేదంటే ఏప్రిల్‌ మొదటి వారంలో పోలీసుల ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసుశాఖలో సుమారు 18 వేలకుపైగా ఖాళీలున్నట్లు అధికారులు చెబుతున్నారు.

త్వరలోనే నోటిఫికేషన్‌..
కాగా ప్రభుత్వం శాఖల వారీగా ప్రకటించిన ఖాళీలను భర్తీ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఉదాహరణకు విద్యాశాఖను తీసుకుంటే ఇందులోని ఖాళీలను భర్తీ చేయాలంటే మొదట టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పోలీస్‌ శాఖ విషయంలో అలా కాదు. నేరుగా నియామకాల ప్రక్రియను ప్రారంభించవచ్చు. నాలుగేళ్ల క్రితం సుమారు 16వేల ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో ఎంపికైన అభ్యర్థుల శిక్షణ పూర్తికాగానే మరోసారి భారీగా పోలీసుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. హోంమంత్రి కూడా అదే చెప్పుకొచ్చారు. దీనికి తగ్గట్లుగానే అసెంబ్లీ సాక్షిగా భారీగా కొలువుల భర్తీపై కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. దీంతో రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి అప్రమత్తమైంది. కొత్త జిల్లాలు, జోన్ల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పోలీస్‌శాఖ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

Also Read:Money Saving Ideas: డబ్బు సేవ్ చేయటంలో ఈ టిప్స్ పాటించండి.. ఆర్థిక మెరుగుదలకు ఇలా చేయండి..

Facebook: ఇకపై మీ దుస్తులు మీరే ఉతుక్కోవాలంటూ ఉద్యోగులకు నోటీసు.. ఫేస్ బుక్ అలా ఎందుకు చేసిందంటే..

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?