TSPSC Group 2: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ల విడుదలకు ఉత్తర్వులు జారీ

|

Aug 30, 2022 | 9:54 PM

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌! గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ల విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

TSPSC Group 2: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ల విడుదలకు ఉత్తర్వులు జారీ
Tspsc Group 2
Follow us on

TSPSC Group 2,3 Notifications 2022: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌! గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ల విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీష్‌ రావ్‌ మంగళవారం (ఆగస్టు 30) సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. విడుదలకానున్న నోటిఫికేషన్లలో గ్రూప్‌ 2 పోస్టులు 663 ఉండగా, గ్రూప్‌ 3 పోస్టులు 1,373 వరకు ఉన్నాయి. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ద్వారా భర్త చేయనున్నారు.

గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్ల ద్వారా వ్యవసాయ, పశుసంరక్షణ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇతర నోటిఫికేషన్లను కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. ఉద్యోగార్ధులందరికి ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.