Telangana Medical Professionals Recruitment 2021: తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతోన్న రోగులకు సరిపడ వైద్య సిబ్బందిని సమకూర్చాలనే ఉద్దేశంతో ఏకంగా 50 వేల వైద్య సంబంధిత ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది.
* నోటిఫికేషన్‌లో భాగంగా డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు భర్తీ చేయనున్నారు. రిటైర్డ్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,00,000 జీతంగా అందిస్తారు.
* మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 40,000 జీతంగా అందిస్తారు.
* మెడికల్ ఆఫీసర్లకు (ఆయుష్) నెలకు రూ. 35,000 జీతంగా అందిస్తారు.
* స్టాఫ్ నర్సులకు నెలకు రూ. 23, 000, ల్యాబ్ టెక్నీషియన్‌కు నెలకు రూ. 17,000 జీతంగా చెల్లిస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీగా 22.05.2021 నిర్ణయించారు.
* దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ కోర్సులు చేసిన యువతకు మంచి అవకాశాలు..! కరోనా వల్ల పెరిగిన డిమాండ్..?