Telangana Jobs: జోనల్ వ్యవస్థ అమలులో మరో ముందడుగు పడింది. కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనలు పాటించాలంటూ సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఇక మీదట స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో స్థానికుల 95 శాతం, ఇతరులకు 5 శాతం చొప్పున ఉద్యోగాలు లభించనున్నాయి. కాగా, కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల ఎంపిక, నియామకాలు, పదోన్నతులు చేపట్టాలని జీఏడీ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లు, 33 జిల్లాలతో కూడిన కొత్త జోనల్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ అమెండ్‌మెంట్ ఆర్డర్-2021’ పేరుతో రూపొందించిన ఈ జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏప్రిల్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జోనల్ వ్యవస్థ కారణంగా స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు కల్పించేందుకు అవకాశం లభించిందని జీఏడీ కార్యదర్శి వికాస్ రాజ్ సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. జోనల్ వ్యవస్థకు లైన్ క్లియర్ అవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. శాఖల వారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే పలు దాఫాలుగా అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు.
Also read:
TS Eamcet Hall Tickets: టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Guru Purnima 2021: గురు పూర్ణిమ శుభ ముహుర్తము.. ప్రాముఖ్యత.. ఈరోజున ఏం చేయాలంటే..
Ramyakrishna : కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ పై సినీనటి రమ్యకృష్ణ అద్భుతమైన రియాక్షన్