తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన బోధన, బోధనేతర పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరులూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (టీఎస్‌ఈఎస్) దరఖాస్తులు కోరుతోది. ఎంపికైన ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఇంగ్లిష్ మీడియంలో బోధించాల్సి ఉంటుంది. షేరింగ్ ప్రాతిపదికన బోర్డింగ్, లాడ్జింగ్ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం కల్పిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2023వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నోటిఫికేషన్ కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేస్తారు.
ఆయా పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఎల్ఐఎస్సీలో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గరిష్ఠ వయోపరిమితి: జులై 1, 2023 నాటికి 60 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా అకడమిక్ మెరిట్, అనుభవం, డెమో ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు పీజీటీలకు రూ.35,750, టీజీటీలకు రూ.34125, లైబ్రేరియన్‌లకు రూ.30,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.