AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS ECET 2025 Result Today: మరికొన్ని గంటల్లోనే ఈసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు మే12న నేడు ఈసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు ఆదివారం (మే 25) విడుదలకానున్నాయి. ఈ మేరకు టీజీ ఈసెట్‌ ఫలితాలు..

TS ECET 2025 Result Today: మరికొన్ని గంటల్లోనే ఈసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
ECET 2025 Results
Srilakshmi C
|

Updated on: May 25, 2025 | 1:27 PM

Share

హైదరాబాద్‌, మే 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు మే12న నేడు ఈసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు ఆదివారం (మే 25) విడుదలకానున్నాయి. ఈ మేరకు టీజీ ఈసెట్‌ ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదలకానున్నట్లు ఈసెట్‌ కన్వీనర్‌ పి.చంద్రశేఖర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్‌ ఎం కుమార్‌ ఈ రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈసెట్‌ ఫలితాలు విడుదల అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకుని ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్‌ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కూడా ఈసెట్‌ పరీక్షను హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన విషయం తెలిసిందే.

SBI PO మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పటి నుంచంటే?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2024 పోస్టులకు సంబంధించి మే 5వ తేదీన నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలను ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. చివరి దశ అయిన ఇంటర్వ్యూలు జూన్‌ 5వ తేదీ నుంచి 9 వరకు జరగనున్నాయి. ఇక సైకోమెట్రిక్‌ టెస్ట్‌ మే 31న నిర్వహించనున్నారు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచుల్లో మొత్తం 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకుగానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!