
హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్ 2026) పరీక్షల షెడ్యుల్ శుక్రవారం (జనవరి 3) విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం అవుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు కొనసాగుతాయి.
షెడ్యూల్ ప్రకారం ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 4, 5 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి. కాగా ఈ ఏడాదికి కూడా ఈ ఏడాదికి కూడా JNTU-హైదరాబాద్ ఆధ్వర్యంలోనే TG EAPCET 2026 పరీక్ష నిర్వహించనున్నారు. మిగిలిన CETలను వేర్వేరు యూనివర్సిటీలను కేటాయిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.