TG DSC 2024 Edit Option: డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. టెట్‌ వివరాల్లో తప్పుల సవరణకు నేడు, రేపు అవకాశం

|

Sep 12, 2024 | 6:22 AM

తెలంగాణ డీఎస్సీ-2024 పరీక్ష రాసిన అభ్యర్ధులు గతంలో ఎంటర్‌ చేసిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌)లో వివరాల్లో ఏవైనా తప్పులుంటే సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీ తుది మార్కులు ప్రకటనకు ఆయత్తమవుతున్న విద్యాశాఖ ఈ మేరకు అభ్యర్ధులకు అవకాశం ఇచ్చింది. అందుకు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో అవకాశం ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి బుధవారం..

TG DSC 2024 Edit Option: డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. టెట్‌ వివరాల్లో తప్పుల సవరణకు నేడు, రేపు అవకాశం
TG DSC 2024 Edit Option
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12: తెలంగాణ డీఎస్సీ-2024 పరీక్ష రాసిన అభ్యర్ధులు గతంలో ఎంటర్‌ చేసిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌)లో వివరాల్లో ఏవైనా తప్పులుంటే సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీ తుది మార్కులు ప్రకటనకు ఆయత్తమవుతున్న విద్యాశాఖ ఈ మేరకు అభ్యర్ధులకు అవకాశం ఇచ్చింది. అందుకు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో అవకాశం ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి అవకాశమని, అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు టెట్‌ వివరాలను సవరించుకోవచ్చని తెలిపారు.

కాగా తెలంగాణ టెట్‌ 2024 ఫలితాలు జూన్‌ 12 విడుదలైన సంగతి తెలిసిందే. మే 20 నుంచి జూన్‌ 2 వరకు జరిగిన ఈ పరీక్షలు జరిగాయి. అయితే అప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడటంతో దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. తాజాగా డీఎస్సీ తుది కీ విడుదలవడంతో త్వరలోనే ఫలితాలు కూడా ప్రకటించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అయితే టెట్‌ పరీక్ష అనంతరం వచ్చిన మార్కులను డీఎస్సీ దరఖాస్తులో నమోదు చేయలేదని కొందరు, మార్కులు, హాల్‌టికెట్, సబ్జెక్ట్‌ ఎంట్రీ వంటి పలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో తప్పులు దొర్లాయని మరికొందరు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయంకి చేరుకుని సవరణకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ రెండు రోజులపాటు టెట్ వివరాల నమోదుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి డీఎస్సీ అప్లికేషన్‌ ఎడిట్‌ ఆప్షన్‌ ప్రారంభంకానుంది. అభ్యర్ధులు ఈ అవకాశం సద్వినియోగ పరచుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

ఇదిలా ఉంటే మరో వారం రోజుల్లో డీఎస్సీ ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో డీఎస్సీ మార్కులకు టెట్‌ మార్కులను కలిపి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ ముగిస్తే టెట్‌ మార్కుల అప్‌డేట్‌ చేసేందుకు ఇక అవకాశం ఇండదు. దీంతో తప్పుల సవరణకు మరో అవకాశం ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముందుకొచ్చింది. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ విడుదల చేసిన తర్వాత 1:3 నిష్పత్తిలో మెరిట్‌ లిస్టు ప్రకటిస్తారు. వారందరికీ డీఈవోలు ధ్రువపత్రాల పరిశీలన జరుపుతారు.

ఇవి కూడా చదవండి

అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.