
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 859 ఉద్యోగాలను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 24, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి 7వ తరగతి, ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కొన్ని పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 24, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.400 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.24,280 నుంచి రూ.72,850 వరకు, ఎగ్జామినర్, కాపిస్ట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 22,240 నుంచి రూ.67,300 వరకు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ.19,000 నుంచి రూ.58,850 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోండి.
తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.