AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG CPGET 2025 Notification: సీపీగెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. మరో 4 రోజుల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో (పీజీ) ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌ ప్రొఫెసర్‌ వుడిత్యాల బాలకిష్టారెడ్డి శుక్రవారం ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు..

TG CPGET 2025 Notification: సీపీగెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. మరో 4 రోజుల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Telangana CPGET
Srilakshmi C
|

Updated on: Jun 14, 2025 | 10:58 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 14: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో (పీజీ) ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌ ప్రొఫెసర్‌ వుడిత్యాల బాలకిష్టారెడ్డి శుక్రవారం ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నోటిఫికేషన్‌ ప్రకారం సీపీగెట్‌ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 297 కాలేజీల్లో పీజీ కోర్సులు, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

సీపీగెట్‌ ఎంట్రెన్స్‌ 2025 ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్‌, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీల్లోని సీట్లను సైతం భర్తీ చేస్తారు.మొత్తం మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు నిండటంతో ఏపీ కోటా సీట్లకు ఈ ఏడాది నుంచి కోతపెట్టనున్నారు. గతంలో 15 శాతం సీట్లను ఏపీ విద్యార్ధులకు కేటాయించేవారు. ఇక నుంచి ఏపీ విద్యార్థులు నాన్‌లోకల్‌ కోటాలో మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. ఈ సారి నుంచి దివ్యాంగ విద్యార్ధులకు 5 శాతం రిజర్వేషన్‌ సైతం అమలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభతేదీ: జూన్‌ 18, 2025.
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 17, 2025.
  • రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు తుది గడువు: జూలై 24, 2025.
  • రూ.2 వేలు ఆలస్యం రుసుముతో దరఖాస్తుకు తుది గడువు: జూలై 28, 2025.
  • ప్రవేశ పరీక్షలు: ఆగస్టు మొదటి వారంలో

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?