Free Coaching: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌… టీఎస్పీయస్సీ గ్రూప్‌-1కు ఉచిత శిక్షణ.. ఎక్కడంటే?

|

Mar 05, 2024 | 3:59 PM

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ ఇటీవల టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా బీసీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 ఉద్యోగార్ధులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ డి. శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సైదాబాద్‌ కాలనీ లక్ష్మీనగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో మార్చి 8 నుంచి ఈ శిక్షణ ప్రారంభం..

Free Coaching: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌... టీఎస్పీయస్సీ గ్రూప్‌-1కు ఉచిత శిక్షణ.. ఎక్కడంటే?
Free Coaching for TSPSC Group 1
Follow us on

హైదరాబాద్‌, మార్చి 5: తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ ఇటీవల టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా బీసీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 ఉద్యోగార్ధులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ డి. శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సైదాబాద్‌ కాలనీ లక్ష్మీనగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో మార్చి 8 నుంచి ఈ శిక్షణ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు. పూర్తి వివరాల కోసం 040-24071178, 27077929 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

తెలంగాణ ఎడ్‌సెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు నిర్వహించేందుకు టీఎస్‌ ఎడ్‌సెట్‌-2024 షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 3 నుంచి 6 తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు కన్వీనర్‌ సూచించారు. ఆలస్య రుసుం లేకుండా మే నెల 5వ తేదీ వరకు, రూ.250 ఆలస్య రుసుంతో అదే నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. మే 25వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు షిఫ్టుల చొప్పున ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీఈ ప్రవేశాలకు మార్చి 5 నుంచి దరఖాస్తులు ప్రారంభం

విద్యా హక్కు చట్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు 25 శాతం అడ్మిషన్లు కల్పించేందుకు మార్చి 5 నుంచి మార్చి 25లోపు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,350 పాఠశాలల్లో 25శాతం సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు ప్రవేశాలు కల్పించనున్నారు. స్టేట్‌ సిలబస్‌ పాఠశాలలో చేరడానికి జూన్‌ 1వ తేదీ నాటికి విద్యార్థికి ఐదేళ్లు.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌ పాఠశాలల్లో చేరడానికి ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణాల్లో 1.44లక్షలు ఉండాలి. ఇతర వివరాలకు టోల్‌ ఫ్రీ 18004258599లో సంప్రదించాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.