Army Recruitment Rally: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. పూర్తి వివరాలు

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అద్భుతం అవకాశం.. అలాంటి వారి కోసం తెలంగాణలో త్వరలో రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగనుంది. తెలంగాణలోని 33 జిల్లాల నుండి సైన్యంలోకి ఆభ్యర్థులను అగ్నివీరులుగా చేర్చుకొవడానికి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనుంది..

Army Recruitment Rally: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. పూర్తి వివరాలు
Army Recruitment Rally

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 23, 2024 | 6:42 PM

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అద్భుతం అవకాశం.. అలాంటి వారి కోసం తెలంగాణలో త్వరలో రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగనుంది. తెలంగాణలోని 33 జిల్లాల నుండి సైన్యంలోకి ఆభ్యర్థులను అగ్నివీరులుగా చేర్చుకొవడానికి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనుంది.. 08 డిసెంబర్ 2024 నుంచి 16 డిసెంబర్ 2024 వరకు రంగారెడ్డి జిల్లాలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియం (గచ్చిబౌలి స్టేడియం) లో తెలంగాణ అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2024 జరగనుంది.. తెలంగాణ లోని 33 జిల్లాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి అభ్యర్థులకు అగ్నివీర్ జనరల్ డూటి, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ అగ్నివీర్ ట్రెడ్స్ మెన్ 10th ఉత్తీర్ణత, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ 8th ఉత్తీర్ణత కేటగిరీలకు ర్యాలీ నిర్వహించనున్నారు.

మహిళా మిలిటరీ పోలీస్ (WMP) అభ్యర్థులకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కేంద్ర పాలిత ప్రాంతం, పుడుచ్చెరి (కరైకల్ – యానాం) నుంచి మహిళా మిలిటరీ పోలీస్ (WMP) అభ్యర్థులు, ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ సైట్ కి అన్ని డాక్యుమెంట్ లను తీసుకురావాలని ఆర్మీ అధికారులు ప్రకటనలో తెలిపారు.

రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తిగా అటోమేటేడ్, ఫెయిర్, పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా ఉత్తర్ణత సాధించడానికి లేదా నమోదు చేసుకోవడానికి సహాయం చేయగలమని క్లెయిమ్ చేసే మోసపూరిత ట్వీట్లు / మోసగాళ్ల నుంచి అభ్యర్తులు జాగ్రత్త వహించాలి. రిక్రూట్ మెంట్ కార్యాలయం (టెలి నంబర్ 040-27740059, 27740205) నుంచి అన్ని రిక్రూట్ మెంట్ సంబంధిత సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..