హైదరాబాద్, డిసెంబర్ 13: జపాన్‌లో నర్సు ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉంది. అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వారికి సదావకాశం వచ్చింది. మనదేశంలోనే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి జపాన్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం డిసెంబర్ 13న మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు బ్యాచ్‌ల కింద 32 మందిని జపాన్‌లోని ప్రముఖ ఆసుపత్రుల్లో నర్సులను నియమించింది. తదుపరి బ్యాచ్‌ల కోసం అర్హులైన అభ్యర్థులకు శుక్రవారం వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అర్హత ఉన్న వారు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి నేరుగా హాజరు కావచ్చు. జీఎన్‌ఎం, డిప్లొమా, ఏఎన్‌ఎం పారామెడికల్, ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్ విద్యార్హతలున్న 19 నుంచి 30 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు జపనీస్ భాషపై రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. అలాగే జపాన్‌లో పనిచేయడానికి అవసరమైన వృతినైపుణ్యాలు అందించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.5 లక్షల నుంచి 1.8 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ఇతర వివరాలకు 97045 70248, 95739 45684 నంబర్లకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ మేరకు Telangana Overseas Manpower Company Limited (TOMCOM) రాష్ట్ర నిరుద్యోగులు ఈ సదావ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. నర్సింగ్ అర్హత ఉన్న వారు వెంటనే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
రైల్వే శాఖలో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ నియామక రాత పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు తమ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 1 నిర్వహించనున్నారు. మొత్తం రెండు దశల్లో రాత పరీక్షలు ఉంటాయి. అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ జేఈ పరీక్ష అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.